రైతు రిజిస్ట్రీలో తప్పకుండా నమోదు చేసుకోవాలి..

రైతు రిజిస్ట్రీలో తప్పకుండా నమోదు చేసుకోవాలి..

  • డీఏఓ విజయచంద్ర

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : అర్హులైన ప్రతి రైతు తమ వివరాలను రైతు రిజిస్ట్రీలో తప్పకుండా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) విజయ్ చంద్ర సూచించారు. హన్మకొండ జిల్లా జీడబ్ల్యూఎంసీ రెండవ డివిజన్ వంగపాహడ్ లో రైతు రిజిస్ట్రీ కార్యక్రమ అమలు పురోగతిని, జిల్లా వ్యవసాయ అధికారి ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల నమోదు, ధృవీకరణ ప్రక్రియను పరిశీలించి, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. అలాగే రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.

ఈ మేరకు మాట్లాడుతూ.. నమోదు వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు రిజిస్ట్రీ ద్వారా సమగ్ర రైతు డేటాబేస్ రూపొందిస్తారని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ పథకాల అమలులో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా విజయవంతంగా పూర్తి చేయడానికి క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనురాధ, ఏఈవో బిందు , వంగపహాడ్ సొసైటీ సీఈఓ పరమెష్, వంగపాహాడ్ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply