రోడ్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

రోడ్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..
ఉరుసు బైపాస్ రోడ్డుపై ధర్నా నిర్వహించను డివిజన్ ప్రజలు
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ రోడ్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని 40 డివిజన్ ప్రజలు రాస్తారోకోనిర్వహించారు.40 వ డివిజన్ శ్మశానవాటిక ప్రధాన రహదారి పై కల్వర్టు రోడ్డు ధ్వంసం కావడంతోకుమ్మరివాడ రాకపోకలకు ఇబ్బంది అవుతుందంటూ కుమ్మరి సంఘం రాష్ట్ర నాయకుడు ఆవునూరి రామ్మూర్తి ఆధ్వర్యంలో ప్రజలు సోమవారం ఖమ్మం బైపాస్ ఉరుసు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. రోడ్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కల్వర్టు నిర్మించి రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన రహదారిపై డివిజన్ ప్రజలు నిరసన తెలిపినారు. రోడ్డు ధ్వంసం చేయడం వల్ల విద్యార్థులకు, స్థానికులకు, పంట పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని రామ్మూర్తి తెలిపారు.ఇంత ఆందోళన జరుగుతున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని డివిజన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలంటూ సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశామని బాధితులు పేర్కొన్నారు.
