OG 2 | బుట్టబొమ్మ పూజా హేగ్డే..
OG 2 | బుట్టబొమ్మ పూజా హేగ్డే..
OG 2 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బుట్టబొమ్మ పూజా హేగ్డే.. ఒకప్పుడు ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాల్లో నటించింది. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి ఫుల్ ఫామ్లో ఉండేది. అయితే.. ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడింది. అందుకే.. ఇప్పుడు ఈ అమ్మడు సరైన క్రేజీ ప్రాజెక్టు కోసం చూస్తుంది. ఇలాంటి టైమ్లో బుట్టబొమ్మకు క్రేజీ మూవీలో ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. మరో వైపు.. ఆ సినిమాలో పూజా వద్దు బాబోయ్ అని అభిమానులు అంటున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఆ క్రేజీ మూవీ ఏంటి..? అభిమానులు.. పూజా వద్దు అనడానికి కారణం ఏంటి..?
పూజాతో సినిమా చేస్తే..
పూజా హేగ్డే టైమ్ ఏమాత్రం బాలేదు. ఆమె నటించిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఈమధ్య కాలంలో పూజా నటించిన ఆచార్య, కిసికా భాయ్ కిసికి జాన్, రెట్రో, కూలీ సినిమాలు ప్లాప్ అయ్యాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ ఆఖరి చిత్రం జన నాయగన్ బ్లాక్ బస్టర్ అయి పూజాకి మళ్లీ ఫేమ్ తీసుకువస్తుంది అనుకుంటే.. ఆ సినిమా సెన్సార్ కష్టాల వలన ఆగిపోయింది. జనవరిలో రిలీజ్ కావాల్సిన జన నాయగన్ ఇంత వరుకు విడుదల కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ఇలా పూజాతో సినిమా చేస్తే.. ప్లాప్ అవ్వడం లేదా రిలీజ్ కాకుండా ఆగిపోవడం జరుగుతుంది.

ఓజీ సీక్వెల్లో.. పూజా..?
ఇదిలా ఉంటే.. పూజాకు ఓజీ సీక్వెల్ లో నటించే లక్కీ ఛాన్స్ వచ్చిందని.. ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పూజానా వద్దు బాబోయ్ అంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఫ్లాపుల్లో ఉన్న పూజా ఎందుకు అంటూ కామెంట్లు పెడతున్నారు. అయితే.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవర్ స్టార్ కు జంటగా శ్రీలీల నటించింది. అయితే.. ముందుగా పూజానే అనుకున్నారు. కానీ డేట్స్ ప్రాబ్లమ్ వలన కుదరలేదు. ఆ టైమ్ లో పూజా అనగానే ఓకే అన్నారు. ఇప్పుడు పూజా అంటే అభిమానులు వద్దు అంటున్నారు.

అంచనాలకు మించి..
ప్రచారంలో ఉన్న వార్త పై ఓజీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే.. ఓజీ 2 లేట్ అవుతుందేమో అనుకున్నారు కానీ.. పవర్ స్టార్ ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో త్వరలోనే పట్టాలెక్కించనున్నారని తెలిసింది. ఊహించని విధంగా ఎప్పటికప్పుడు ఓజీ 2 అప్ డేట్స్ ఇస్తున్నారు. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ సుజిత్ అంచనాలకు మించి ఉండేలా ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా పూజాని తీసుకుంటారో లేక మరో హీరోయిన్ ని ఫైనల్ చేస్తారో చూడాలి.

