నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : ఫెర్టిలైజర్ షాపుల యాజమానులు నకిలీ విత్త నాలు విక్రయిస్తే చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ అధికారులు, మండల వ్యవసాయ అధికారి కళ్యాణి, ఎస్ఐ అమూల్య పేర్కొన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ దుకా ణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రికార్డులను సక్రమంగా మెయింటెన్ చేయాలని, రైతులు కొన్న విత్తనాలు, ఎరువులకు రశీదులు అందించాలన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించవద్దని సూచించారు. ప్రభు త్వ నిబందనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
