సొంతింటి కలలకు ప్రభుత్వం భరోసా..

సొంతింటి కలలకు ప్రభుత్వం భరోసా..

  • ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో క్యాతరాజు స్వాతి, దశరథం దంపతుల నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయాలు కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేర్లపై మంజూరు చేయడం ద్వారా కుటుంబ ఆస్తులపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పేదల గృహ కలలను నిజం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply