రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో దివంగత యువనేత బోనగిరి గణేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫ్రెండ్స్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ, బోనగిరి గణేష్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో గణేష్ తల్లిదండ్రులు నరసయ్య, జ్యోతి, ఫ్రెండ్స్ సొసైటీ అధ్యక్షుడు గంగసాని నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎండి బాబా, సభ్యులు మంగళపల్లి శివకుమార్, మాదాని నవీన్, చెన్న రాజేష్, గడ్డమీది సాయినాథ్, ఎర్ర రాజేష్, కాముని శివకుమార్, కంకల లింగస్వామి, పరుష నరేష్, రావుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
