రైతులకు రూ. 8.25 కోట్ల రుణాలు పంపిణీ…

రైతులకు రూ. 8.25 కోట్ల రుణాలు పంపిణీ…
తిరువూరు, ఆధ్రప్రభ : తిరువూరు మండలం లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులకు రూ. 8 కోట్ల 25 లక్షల రూపాయలు దీర్ఘకాలిక రుణాలు పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షురాలు నెక్కడకు ప్రమీల చేతులమీదుగా దీర్ఘకాలిక రుణాలు గేదెలు, గొర్రెలు కొనుగోలు నిమిత్తం, రైతు నేస్తం కోటి రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది రైతు సంక్షేమం కోసం వివిధ రకాల లోన్లు రైతులకు అందజేసినట్లు తెలిపారు.
రైతులకు పంట రుణాలు సైతం రూ. కోటి 22 లక్షల రుణాలు పంపిణీ చేసినట్లు ప్రమీల పేర్కొన్నారు. లక్ష్మీపురం పిఎసిఎస్ లో రైతులకు బంగారు ఆభరణాల మీద కూడా రుణాలు కోటి రూపాయల వరకు పథకం ప్రారంభించిన కొద్ది నెలలలోనే రైతులకు అందజేసినట్లు తెలిపారు. రైతుల సౌకర్యార్థం లాకర్స్ ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
సొసైటీలో రైతులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ ప్రెసిడెంట్ నెక్కెడపు శ్రీనివాసరావు, డైరెక్టర్లు మిద్దె నరసింహారావు, కోట పుల్లయ్య, సహకార సంఘం సీఈవో బొల్లినేని రఘురామ్, రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
