ఆలేరులో మొదటి బిఈసి సమావేశం..

ఆలేరులో మొదటి బిఈసి సమావేశం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బుధవారం రైల్వే ఉద్యోగులు మొదటి బిఈసి సమావేశం జరిగింది. బ్రాంచ్ చైర్మన్ తిరుపతిరావు, కార్యదర్శి ఎలేందర్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. సికింద్రాబాద్ డివిజన్ బాధ్యులు పి రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు, హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య సూచనలు చేశారు.ఉద్యోగుల సమస్యలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఏడిఎస్ , సి సి ఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ చిలుకు స్వామి, ఆఫీస్ బేరర్స్,పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.