ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోనులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నారాయణపురం, సర్వేల్ గ్రామాలలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేయొద్దని వడ్లు కుప్పలుగా పేరుకుపోయాయని త్వరితగతిన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు వారం రోజులలో తీర్చకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా రైతులను సమీకరించి మహాధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నర్రి నరసింహ, కూసుకుంట్ల సత్తిరెడ్డి, పాలెం వీరేష్, చెరుకుపల్లి బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
