Scooty | స్కూటీ ఢీకొని వృద్ధ కార్మికుడు మృతి..

Scooty | స్కూటీ ఢీకొని వృద్ధ కార్మికుడు మృతి..
Scooty | తెనాలి, ఆంధ్రప్రభ : తెనాలి పట్టణంలో హృదయవిదారకమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో, కష్టపడి పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్న ఓ వృద్ధ ముఠా కార్మికుడు జీవితం ఒక్క క్షణంలో అంతమైపోయింది. బాలాజీరావుపేటకు చెందిన నాగమల్లేశ్వరరావు రోజంతా కష్టపడి పని ముగించుకుని, అలసటతో నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా… మార్కెట్ వంతెన సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్కూటీ ఢీకొట్టింది.
బలంగా గాయలవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ స్కూటీని సంజు అనే యువకుడు నడుపుతుండగా, వెనుక కూర్చున్న ట్రాన్స్జెండర్ కి కూడా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
