11 kilometers | వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం

11 kilometers | వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం
11 kilometers | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలో మీటర్ల మేర దివ్యాంగులతో కలిసి నేతల ప్రయాణం కొనసాగింది. ఈ సందర్భంగా దివ్యాంగులతో నేతలు సరదాగా సంభాషించారు. వారి బాగోగులు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
