గుడుంబా స్తావరాల పై పోలీసుల దాడులు..

గుడుంబా స్తావరాల పై పోలీసుల దాడులు..
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపెల్లి మండలం ఆలుగామా గ్రామం లోని గుడుంబా స్థావరలపై ఇవ్వాళ వేకువజమున చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించి గుడుంబా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం పానకాన్ని ధ్వసం చేశారు. ఈ సందర్బంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ గ్రామాలలో గుడుంబా తయారు చేయడంతో ఆ ప్రాంతాల యువత గుడుంబా కు అలవాటుపడి మరణిస్తున్నారని అన్నారు. గ్రామాలలో గుడుంబా తయారు చేసి, విక్రయలు చేసినట్లయితే తమ సిబ్బంది చే దాడులు నిర్వహించి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హేచ్చరించారు. ఈ దాడులలో కోటపెల్లి ఎస్సై రాజశేఖర్, అబ్కారిశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
