పిల్లల భద్రత, మాదకద్రవ్యాలపై అవగాహన
పిల్లల భద్రత, మాదకద్రవ్యాలపై అవగాహన
పరకాల, ఆంధ్రప్రభ : పోలీసుల ఆధ్వర్యంలో పిల్లల భద్రత, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పలాన-ప్రగతి ప్రాణాలికలో భాగంగా పరకాల ఏసిపి సతీష్ బాబు ఆధ్వర్యంలో పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ నేతృత్వంలో పట్టణంలో ర్యాలీ కార్యక్రమంలో నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని చైతన్య మోడల్ హై స్కూల్‌లో పిల్లల భద్రత మరియు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ బాబు, సిఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల నడవడికను గమనించాలని, పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణ గురించి నిత్యం బోధించాలని, విద్యార్థులు స్నేహితులతో కలిసి చెడు వ్యసనాలను అలవాటు చేసుకోవద్దని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఈగిల్ ఫోర్స్ ఎస్ఐ రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
