BJP | గ్రామీణ ప్రాంతాల అభివృద్దే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

BJP | గ్రామీణ ప్రాంతాల అభివృద్దే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

  • బీజేపీ జిల్లా అధ్యక్షులు

BJP | ఆంధ్రప్రభ, చెన్నూర్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే వీబీ వీ రాంజీ బిల్లు పెట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ అన్నారు. పట్టణ బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రతి పేదవాడికి ఉపాధి కల్పించాలి.. వారికి గౌరవం దక్కాలి.. పేద‌ గిరిజనులు వెనుకబడిన తరగతులకు ఉపాధి లభించేలా ఈ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. వికసిత్ భారత్ 20047 జాతీయ దర్శనికతకు అనుగుణంగా గ్రామీణ అభివృద్ధికి కొత్త ప్రేమ వర్క్ సిద్ధం చేయడమైందన్నారు.

ఈ చట్టం మహాత్మా గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా ఉంది.. ఇంకా రామరాజ్య స్థాపనకు మార్గం సుగమం చేస్తుందన్నారు. కాబట్టి ప్రజలకు వందరోజుల ఉపాధి నుండి 125 రోజులకు పెంచి పేద ప్రజలకు మేలు చేస్తుందన్నారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మకుండా దేశ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply