మహిళల సాధికారతతోనే..
మహిళల సాధికారతతోనే..
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలోని ప్రతి మహిళకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా పునాది వంటివారని ఆయన పేర్కొన్నారు. తల్లి, అక్క, చెల్లి, భార్యగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి మహిళలదని అన్నారు.
మహిళల సాధికారత, విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తేనే.. సమాజం నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి మహిళ గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవించే సమాజం నిర్మించడమే మన అందరి లక్ష్యమని తెలిపారు. మహిళా శక్తికి తాను వందనం చేస్తున్నట్లు పేర్కొంటూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
