నర్సింహులపేటలో హనుమాన్ జయంతి వేడుకలు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మండలంలోని పలు గ్రామాలతో పాటు మండల కేంద్రంలో ఉన్న మారుతి బజారు,గంగమ్మదేవి దగ్గర ఉన్న ఆలయాల్లో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మూల విరాట్ కు సింధూర లేపనం,ప్రత్యేక పూజలు చేశారు.అన్నదానాలు ప్రసాదాలను భక్తులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు అల్వాల నవీన్ కుమార్,బండి రమేష్, పట్నూరి ప్రేమ్ కుమార్,చౌడవరపు శ్రీనివాస్,ఈరగాని బిక్షం,జినుకల రమేష్,అల్వాల రవి తదితరులు ఉన్నారు.