సాంకేతికతతో విద్యాబోధన అందించాలి..

సాంకేతికతతో విద్యాబోధన అందించాలి..

  • పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్

తొర్రూరు, ఆంధ్రప్రభ : సాంకేతికతను వినియోగించుకొని విద్యాబోధన అందించాలని పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్,ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య లు అన్నారు.ఇటీవల కాకిరాల హరిప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమారం గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు సుమారు రూ.2 లక్షల విలువచేసే ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ బోర్డులను హరిప్రసాద్ వితరణ చేశారు. పాఠశాల హెచ్ఎం కె.అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కాకిరాల మాట్లాడుతూ…ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి రావడంతో ఉపాధ్యాయులు డిజిటల్‌ విధానంలో పాఠాలు బోధిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు ఎంతో అభివృద్ధి చెందుతారన్నారు. ఉపాధ్యాయులు టచ్‌ స్ర్కీన్‌ ఆధారిత బోర్డు ద్వారా (ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌ బోర్డు) విద్యార్థులు బోధన చేయాలని సూచించారు.

ప్రతీ స్కూళ్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లను విద్యార్థులకు అందుబాటులో ఉం డేలా చూడాలన్నారు. డిజిటల్‌ బోధనతో విద్యార్థులకు పాఠాలపై ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.స్మార్ట్ క్లాస్‌ల ద్వారా నూతన విషయాలను నేర్చుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఊరు బడిని కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సోమారం సర్పంచ్ కె .లింగమూర్తి, ఉప సర్పంచ్ గాంధారి రామచంద్రు, మాజీ సర్పంచ్ తమ్మడపల్లి సంపత్, మాజీ ఉపసర్పంచ్ భాష బోయిన ప్రభాకర్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం జెల్లా లక్ష్మీనారాయణ, అమ్మ పాఠశాల చైర్ పర్సన్ టి. మౌనిక, వార్డు సభ్యులు కె. రాజు, శ్రీలత, దామోదర్ గౌడ్, సమ్మక్క, వెంకన్న, దర్గయ్య, రజిని, నరేష్ యాదవ్, స్థానికులు కె.సహదేవ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.