పెన్షనర్స్ సంక్షేమమే ఎస్జీపీఏటీ లక్ష్యం…
పెన్షనర్స్ సంక్షేమమే ఎస్జీపీఏటీ లక్ష్యం…
పెన్షనర్స్ బకాయిలు చెల్లించే వరకు పోరాడుతాం
రాష్ట్ర అడిషనల్ కార్యదర్శి రామ మనోహర్
కరీమాబాద్ ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ పెన్షనర్స్ సంక్షేమమే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్ జి పి ఏ టి) లక్ష్యం అని రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రెటరీ వెలిసోజు రామమనోహర్ అన్నారు. ఆదివారంవరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలోఎస్ జిపిఏటి సర్వసభ్య సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శిగునగంటి సాంబయ్య అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వెలిసోజు రామమనోహర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ర సుధీర్ బాబు తో పాటుజిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశంలో జిల్లాప్రధాన కార్యదర్శి గునగంటి సాంబయ్య వార్షిక నివేదిక ప్రవేశపెట్టగా జిల్లా ఆర్థిక కార్యదర్శి కోశాధికారి ఎస్ సదానందం ఆర్థిక నివేదిక ప్రవేశపెట్టారు.సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
రిటైర్డ్ పెన్షనర్స్ అడిగిన పలు సందేహాలను రామ మనోహర్ నివృత్తి చేశారు.రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ఈనెల 25న కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారీగా రిటైర్డ్ పెన్షనర్స్ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు కార్యవర్గ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
