వైటీపీఎస్ ఎదుట భూ నిర్వాసితుల ధర్నా..
ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
మిర్యాలగూడ (ఆంధ్రప్రభ): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) ఎదుట సోమవారం ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన కుటుంబాలు ఆందోళన చేపట్టాయి.
వైటీపీఎస్ పరిధిలోని తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం, తిమ్మాపురం, నరసాపురం, కల్లేపల్లి గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు ప్లాంట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ప్లాంట్ నిర్మాణం కోసం భూములు స్వాధీనం చేసుకున్న సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. భూములు కోల్పోవడంతో జీవనోపాధి దెబ్బతిన్న తమకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు న్యాయం చేయాలని కోరారు.
