చుక్కలతో మెరిసిన వింత చేప..

జాలర్లను ఆశ్చర్యపరిచిన వల!

ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో ఓ జాలరి వలలో చిక్కిన వింత చేప స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం మాటూరి పున్నారావు అనే జాలరి చేపల వేటకు వెళ్లగా, అతను వేసిన వలలో సాధారణ చేపలకు భిన్నంగా కనిపించిన ఓ అరుదైన చేప చిక్కింది.

ఈ చేప ఒళ్లంతా చుక్కలతో ఉండటంతో పాటు, నోటి భాగం కూడా ఇతర చేపలతో పోలిస్తే భిన్నంగా కనిపించింది. దీంతో ఆ చేపను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా జాలర్లు మాట్లాడుతూ, “ఎన్నో సంవత్సరాలుగా చేపల వేట చేస్తున్నాం. అనేక రకాల చేపలను చూశాం. కానీ ఇలాంటి ఆకారంలో, ఇలాంటి రంగులతో ఉన్న చేపను మాత్రం ఎప్పుడూ చూడలేదు” అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ వింత చేప ఏ జాతికి చెందినదన్న అంశంపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.