బాలికల వసతి గృహంలోకి కొండచిలువ..

సత్తుపల్లి, ఆంధ్రప్రభ : సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహంలోకి బుధవారం ఉదయం కొండచిలువ ఒకటి ప్రవేశించి కలకలం రేపింది. సిబ్బంది అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.. బీట్ ఆఫీసరుగా పనిచేస్తూ రిటైర్డ్ అయిన ప్రముఖ స్నేక్ క్యాచర్ మొహమూద్ సంఘటనా స్థలానికి చేరుకొని కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. 12 అడుగుల పొడవున్న ఈ కొండచిలువను పట్టుకుంటున్న క్రమంలో స్నేక్ క్యాచర్ మొహమూద్ మెడను చుట్టేసి మల విసర్జన చేసింది… స్వాధీన పరుచుకున్న కొండచిలువను అటవీశాఖ అధికారులకు అప్పగించారు…

Leave a Reply