కొండగట్టుకు హనుమాన్ భక్తుల పాదయాత్ర..

కొండగట్టుకు హనుమాన్ భక్తుల పాదయాత్ర..
కొండగట్టుకు పాదయాత్రకు బయలుదేరుతున్న హనుమాన్ భక్తులు
టేకుమట్ల , ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామం తో పాటు గ్రామాల నుండి శనివారం హనుమాన్ భక్తులు స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జగిత్యాల జిల్లా కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు ప్రత్యేక స్వాగతం పలికారు 41 రోజులపాటు నియమనిష్టాలతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించిన అనంతరం కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్నట్టు వారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి గ్రామ గ్రామాన హనుమాన్ స్వాములకు భక్తులు ప్రత్యేక స్వాగతం పలికారు ఈ యొక్క పాదయాత్ర మూడు రోజులపాటు కొనసాగుతుందని వారి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
