565National Highway | పలువురికి తీవ్ర గాయాలు
565National Highway | పలువురికి తీవ్ర గాయాలు
565National Highway | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలోని 565వ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 46మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

