శ్రీ శివ విఘ్నేశ్వర ధ్వజస్తంభ మహోత్సవ పూజలు….

శ్రీ శివ విఘ్నేశ్వర ధ్వజస్తంభ మహోత్సవ పూజలు….
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ శివనగర్ 35వ డివిజన్ శ్రీ శివ విఘ్నేశ్వర దత్త సాయి దేవాలయం ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఆవాహిత మంటపారాధన, ధనాధి వాసం, దాన్యాది వాసం, ఫలాదివాసం, పుష్పాదివాసం, పూజాది కార్యక్రమాలు వేద బ్రాహ్మణులుచే నిర్వహించారు. భారీగా భక్తులు హాజరై ధ్వజ స్తంభంకు విశేష పూజలు నిర్వహించారు.
ఈనెల 8న ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్టాప మహోత్సవం, అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధ్యక్షుడు కొండి రాజమౌళి తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చింతం యాదగిరి, కోశాధికారి రాంపల్లి ఉపేందర్, కార్యదర్శి కొయ్యాడ శ్రీధర్, పూజారి జూలపల్లి విశ్వేశ్వర్, కుడి కాల సురేందర్, మాచర్ల నరేందర్, డాక్టర్ చారి, డివిజన్ ప్రజలు భక్తులు భారీగా పాల్గొన్నారు.
