రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

-ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషణ్

కడం, ఆంధ్ర ప్రభ: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ధ్యేయమని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్ అన్నారు ఆదివారం కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ధర్మాజీపేట గ్రామంలో పాండవ పూర్ పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతుల తమ పంట ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన ధరను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం జి. గంగాధర్, పిఎసిఎస్ సీఈఓ ఆశన్న, ఐకెపి సీసీ మల్యాల స్వామి, నిర్మల్ డిసిసి ప్రధాన కార్యదర్శి పి సతీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఎం. మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేష్, కొండుకూర్ ధర్మాజీపేట్ గ్రామాల సర్పంచులు మామిడిపల్లి భీమేష్ , వడ్నాల శిరీష, సత్యం ఉప సర్పంచ్ లు, పి .సంపత్ రెడ్డి, దండగుల యాదగిరి , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply