రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ ప్రారంభం…
రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ ప్రారంభం…
మోత్కూర్, ఆంధ్రప్రభ : ఈ నెల 2 నుంచి 31 వరకు జిల్లాలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీ నర్సింహారెడ్డి అన్నారు.ఆదివారం మోత్కూరులో సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో రెడ్ క్రాస్ కమిటీలను ఏర్పాటు చేయడంలో భాగంగా సభ్యత్వ నమోదును విస్తృతం చేయాలన్న రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ,ఐ ఆర్ సి ఎస్ రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ నిర్ణయంతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
సమాజ సేవ చేయాలని భావించేవారు , ఇతరులకు సహాయ పడాలన్న ఆలోచన ఉన్నవారు రెడ్ క్రాస్ లో సభ్యులుగా చేరి స్వచ్ఛంద కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో రాయగిరి రోడ్డుకు పాత వివేరా హోటల్ పక్కన ఉన్న తమ రెడ్ క్రాస్ భవనంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సభ్యత్వం తీసుకోవచ్చునని చెప్పారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు చేసేందుకు త్వరలోనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
సభ్యత్వం తీసుకునేందుకు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డుతో , రూ 1,160 తో,దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి కార్యాలయంలో ఇవ్వాలని, పరిశీలించిన అనంతరం శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే సభ్యత్వం పొందిన సభ్యులలో తమ వివరాలు చేర్పులు, మార్పులు చేసుకునేందుకు కూడా అవకాశం ఉందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం చరవాణి నం. 8985960689, 9959997750 సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా డైరెక్టర్లు పన్నాల శ్రీనివాసరెడ్డి,కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, ఎండి ఖలీల్, యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు బీసు మచ్చగిరి, మోత్కూరు మండల ఉపాధ్యక్షుడు ముప్ప వెంకట్రెడ్డి , ముప్ప తిరుమలరెడ్డి బద్దం నాగార్జున రెడ్డి, అవిరేని శోభన్ బాబు, తమ్మినేని శ్రీనివాసరావు తదితరులున్నారు.
