జలదిబ్బంగంలో శ్రీలంక కాలనీ..
ఇక్కట్లు పడుతున్న జనం..
జన్నారం,ఆంధ్రప్రభ: పేరుకే మండల కేంద్రం అంతా అస్తవ్యస్తం..జలదిగ్బంధంలో శ్రీలంక కాలనీ,ఇక్కట్లు పడుతున్న జనం.గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం మధ్యాహ్నం మండల కేంద్రం జలమయమై అస్తవ్యస్తంగా తయారైంది.మండల కేంద్రమైన మంచిర్యాల జిల్లా జన్నారం ప్రభుత్వ కార్యాలయాలన్నీ పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలోనే ఉన్నాయి.ఈ గ్రామ పంచాయతీలోని శ్రీలంక కాలనీ జలమయమై రాకపోకలకు జనం ఇబ్బందులు పడుతున్నారు.ఇదే గ్రామ పంచాయతీలోని బుడగ జంగాల కాలనీవాసులు పడరాని పాట్లు పడుతున్నారు.పక్కనుంచి పెద్ద వాగు ఉధృతoగా పారుతుండడంతో ఆ కాలనీవాసులు రాత్రి పానాభయంతో పడరాని పాటుపడుతున్నారు.

గ్రామపంచాయతీలోని మండల కేంద్రం గుండా ప్రధాన రహదారి ఉండడంతో ఆ రోడ్డుపై వరద నీరు చేరి వాహనదారులు,జనం పడరాని పాట్లు పడుతున్నారు.ప్రధాన రహదారిపై రామాలయం,శ్రీలంక కాలనీ రోడ్డు,ఎస్బీఐ,యూబీఐ బ్యాంకుల వద్ద వరద నీరు రోడ్డుపై పారుతుండడంతో ఆయా బ్యాంకులకు వచ్చే మహిళల బాధలు వర్ణనాతీతం.ఈ వ్యవహారంలో వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్లపై పారుతున్న వరదనీరును దారి మళ్ళించడానికి చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీతో పాటు 29 పంచాయతీలలో భారీ వర్షానికి జనం బయటకు రాక ఇంట్లోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు.స్థానిక తహసిల్దార్ బక్కయ్య, ఎస్సై గురం ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో రెవెన్యూ,పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూ జనంకి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కలమడుగు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
భారీ వర్షాలకు మండలంలోని మండలంలోని కలమడుగు- జగిత్యాల జిల్లా కమ్మునూరు బ్రిడ్జి వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. వరద ఉధృతిని స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ పరిశీలించి ఆ బ్రిడ్జి వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
