దేవాలయ భూమిని వెంకన్న స్వామి ఆలయానికే కేటాయించాలి
కేసముద్రం, ఆంధ్రప్రభ : దేవుని ఆలయం కోసం కేటాయించిన భూమిని వెంకన్న స్వామి దేవాలయానికే దక్కేలా చర్యలు తీసుకోవాలని తాళ్లపూసపల్లి గ్రామ పెద్దలు డిమాండ్ చేశారు.
సోమవారం తమపై నమోదైన కేసు సంబంధంగా కోర్టుకు హాజరైన అనంతరం గ్రామ పెద్దలు మీడియాతో మాట్లాడుతూ, గ్రామంలోని దేవాలయం కోసం గతంలో కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దేవాలయ అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించేందుకు ప్రయత్నిస్తే గ్రామ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. అనేక సంవత్సరాల క్రితం దేవాలయ అవసరాల కోసం కేటాయించిన భూమిని కొందరు తమ స్వప్రయోజనాల కోసం ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ భూమి పూర్తిగా వెంకన్న స్వామి దేవాలయ అభివృద్ధికే వినియోగించాలని, అవసరమైతే ఈ అంశంపై ఎక్కడికైనా వెళ్లి పోరాటం చేస్తామని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రావుల రవిచంద్ర రెడ్డి, గొర్రె వెంకన్న, బండి శ్రీను, గోడిశాల వెంకన్న, నరేటి కొమరయ్య, నార్ల రమేష్, మాచర్ల రాములు తదితరులు పాల్గొన్నారు.
