కేసముద్రం స్టేషన్ హై స్కూల్లో గ్రంధాలయ దినోత్సవం

కేసముద్రం, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యా వారోత్సవాలలో ఐదవరోజు గ్రంథాలయ దినోత్సవం పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం హైస్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రస్తుత రోజుల్లో పుస్తక పఠనము చాలా అత్యంత అవసరమని తద్వారా జ్ఞాన సంపాదన చేసుకోవడం జరుగుతుంది అన్నారు.లక్ష్యసాధనకు పుస్తక పఠనం అత్యంత ఆవశకం అన్నారు.

సెల్ ఫోన్ కు తక్కువగా అడిక్ట్ కావాలని ఎక్కువగా పుస్తక పఠనము పేపర్ రీడింగ్ నానో సంబంధిత జర్నల్స్ చదవడం అలవాటు చేసుకోవాలి విద్యార్థి దశనుండే అని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ సందర్బంగా ప్రజా ప్రతినిధులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మెంబెర్ రావుల మురళి , మాజీ ఉప సర్పంచ్ భానోత్ చిన్న వెంకన్న, ఏసీజిఈ మందుల శ్రీరాములు, డి ఎస్ఓ బి అప్పారావు, ఏఎస్ఈ సంతోష్, ఎంఈవో కాలేరు యాదగిరి, తహశీల్దార్ వివేక్, ప్రధానోపాధ్యాయులు బి రాజు, నరేందర్, ఏఏపిసి చైర్మన్ మంజుల, కౌన్సెలర్స్ అరుణ, తరాల వీరేష్ యాదవ్, సుభద్ర, వల్లందాసు ఉమ, ఎండీ అయూబ్ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.