ఉచిత కుటుంబ సలహా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
ఉచిత కుటుంబ సలహా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
కేసముద్రం, ఆంధ్రప్రభ : బాల్య వివాహాల నిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ మహిళల భద్రత కోసమే జెండర్ రిసోర్స్ కేంద్రం ప్రారంభించిందని , ఈ ఉచిత కుటుంబ సలహా కేంద్రం సద్వినియోగం చేసుకోవాలని కేసముద్రం మండల కేంద్రంలో ఎంపీడీవో క్రాంతి అన్నారు. శనివారం కేసముద్రం మండల మండల కేంద్రంలోని సాధికారత మండల సమాఖ్య కార్యాలయంలో జెండర్ రీసెర్చ్ సెంటర్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ నిర్వహణ లో ఏర్పాటుచేసిన ఉచిత కుటుంబ సలహా కేంద్రం జెండర్ రిసోర్ట్ సెంటర్ ను ఎంపీడీవో, ఏపీఎం కృష్ణమూర్తి తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ మహిళల భద్రత హింస నిర్మూలనకు సమాజం కలిసి పనిచేయాలని సూచించారు. బాల్యవివాహాలు బాల కార్మిక వ్యవస్థ జోగిని వ్యవస్థ నిర్మూలించేందుకు చేపట్టిన జెండర్ రీసెర్చ్ సెంటర్ ఉపయోగంగా ఉంటుందన్నారు.
మహిళలు అసమానతకు గురికాకుండా ఉండాలని సూచించారు. మహిళలకు న్యాయం చేసేందుకు ఇలాంటి కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఈ లాంటి రిసోర్స్ కేంద్రం ప్రారంభించడం మంచి శుభ పరిణామం అన్నారు . జెండర్ కేంద్రంలో పనిచేసే జెండర్ కమిటీ మెంబర్స్ ఓపికతో నిష్పక్షిపాతంగా మహిళలకు న్యాయం చేయాలని సూచించారు. ఆడపిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహాలు చేయడం బాల్యవివాహాలను అరికట్టడం, మహిళలపై హింసను ఎదుర్కోవడం, కులమత బేధాలను నిర్మూలించడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు. సామాజిక ఎజెండా లో భాగంగా గృహహింస నిర్మూలన బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడం మద్యపాన నియంత్రణ , మానవ అక్రమ రవాణా నివారణ మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించారు, ఆడపిల్లలకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత వివాహాలు చేయాలని జెండర్ ప్రతిజ్ఞ చేయించారు, తదుపరి ఉల్లాస్ కార్యక్రమంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వాలంటీర్స్ ని అభ్యాసకులను సిబ్బందిని సన్మానించారు.
