ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి
13వ డివిజన్‌లో పెన్షన్ల పంపిణీ
ఏలూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ: మాట ఇచ్చాడంటే చేసి తీరతాడనే పేరును మరోసారి నిలబెట్టుకున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి). 13వ డివిజన్‌లో బుధవారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన చూపిన చొరవ, అంకితభావం ప్రజల మనసులను గెలుచుకుంది.
కొత్తగా మంజూరైన పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పెన్షన్ అందజేశారు ఎమ్మెల్యే చంటి. వృద్ధులకు నమస్కరించి, వితంతువుల కష్టాలను విని, దివ్యాంగులకు భరోసా ఇచ్చిన తీరు అక్కడున్న వారందరినీ కదిలించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పదవి అంటే పేదలకు సేవ చేయడానికే. నా డివిజన్‌లో ఒక్క అర్హుడు కూడా పెన్షన్‌కు దూరం కాకూడదు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజల మధ్యలోనే ఉంటున్నాను. ఇదే బడేటి చంటి మార్క్ పాలన” అని అన్నారు.
పెన్షన్ అందుకున్న అవ్వాతాతలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. “మా చంటి బాబు దేవుడయ్యా. మా కష్టం తీర్చడానికి ప్రతి నెలా తప్పకుండా వస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం మా అదృష్టం” అంటూ లబ్ధిదారులు భావోద్వేగానికి గురయ్యారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న బడేటి చంటి పనితీరు ఏలూరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. “ప్రజల మనిషి” అనే పేరును సార్థకం చేసుకుంటున్నారని స్థానికులు కొనియాడుతున్నారు.
కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్, టీడీపీ-జనసేన నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
