ధాన్యం కొనుగోలులో పారదర్శకత పాటించాలి

ధాన్యం కొనుగోలులో పారదర్శకత పాటించాలి
- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
టేకుమట్ల ,ఆంధ్రప్రభ : మండలంలోధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పార దర్శకత పాటించాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం మండలంలోని రాఘవరెడ్డిపేట,వెల్లంపల్లి టేకుమట్ల గ్రామాల్లో పి.ఎ.సి.ఎస్ , ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని, తేమ శాతం వచ్చిన తర్వాత మార్కెట్‌కు తరలించి మద్దతు ధర పొందాలన్నారు. తూకం విషయంలో ఎలాంటి లోపాలు జరగకుండా ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి, రైతులకు న్యాయం చేయాలని కోరారు.
