కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ నూతన కార్యదర్శి
కన్నబాబు కు ఆలయ మర్యాదలతో స్వాగతం
అమ్మవారి కి ప్రత్యేక పూజలు
ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ: రాష్ట్ర దేవాదాయ శాఖ నూతన కార్యదర్శిగా నియమితులైన కె. కన్నబాబు బుధవారం విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికింది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితులు కన్నబాబుకు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఉప ప్రధాన అర్చకులు శంకర్ సంధిల్యా, స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు.
