స్వామివారిని పెండ్లి కుమారునిగా ముస్తాబు..

స్వామివారిని పెండ్లి కుమారునిగా ముస్తాబు..
గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మండలంలోని పెనుగొలను శివారు మెట్టగుట్ట శ్రీ శేషాచల శ్రీనివాసస్వామి దేవాలయంలో శనివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్యాం సుందరాచార్యులు స్వామివారి మూల విరాట్ కు అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పెండ్లి కుమారునిగా నూతన వస్త్రాలు, ఆభరణాలతో సుందరంగా ముస్తాబు చేసారు.అదేవిధంగా ధ్వజారోహణ నిర్వహించి గరుడ ముద్దలు అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పంది వెంకట్రావు,సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు.
