Telangana | పింఛన్ డబ్బుల కోసమేనా.. ?

Telangana | పింఛన్ డబ్బుల కోసమేనా.. ?

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు ఇంట్లోనే హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది.

వికారాబాద్ పరిధిలోని పరిగి మండలం రంగంపల్లిలో పద్మమ్మ (65) అనే వృద్ధురాలు హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహం ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పదవీ విరమణ చేసిన తర్వాత అనారోగ్యంతో భర్త (ఏఎస్ఐ) మృతి చెందగా, రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కూడా కోల్పోయిన పద్మమ్మ ఒంటరిగా జీవిస్తున్నారు.

స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఆమెకు వచ్చే పింఛన్ డబ్బుల కోసం ఈ హత్య జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.