Jagan | చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌డం దుర‌దృష్ట‌క‌రం..

Jagan | చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌డం దుర‌దృష్ట‌క‌రం..

Jagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సహా ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదని జగన్ స్పష్టం చేశారు. పార్లమెంట్ లో అమరావతి ఏపీ రాజధాని గా చట్టబద్దత కల్పిస్తున్న వేళ జగన్ స్పందించారు. అసలు రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అని ఉందా అని ప్రశ్నించారు.

తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వంటి నాయకుడు ఏపీకి ఉండటం దురదృష్టకరమని, ఆయనకు చిత్తశుద్ధి, నిజాయితీ లేదని ఆరోపించారు. దోపిడీ చేయడమే చంద్రబాబు పని అని, అమరావతికి చట్టబద్ధత బిల్లు విషయంలోనూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగంలో రాష్ట్రానికి రాజధాని అనే పదం లేదని, రాష్ట్ర రాజధాని కేవలం ప్రభుత్వ ఇష్టమని, ఈ విషయంలో కేంద్రం పాత్ర ఉండదని, తీర్మానం పేరుతో డ్రామాలు ఎందుకని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రాలకు రాజధాని అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా అని, రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని వైఎస్‌ జగన్‌ అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టమని, ఆయన దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి అని ఆరోపించారు. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఆయన పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదని, ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతిలో ఏం చేశారని, భూములిచ్చిన రైతులకు హామీలు నెరవేర్చారా అని ప్రశ్నించారు. అమరావతిని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారని, రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతాయని చంద్రబాబు లెక్కలే చెబుతున్నాయని, ఆ లెక్కన లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కావాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Leave a Reply