ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు,పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ గేయాన్ని ఆలపించారు.రెవిన్యూ కార్యాలయంలో తహశీల్దార్ రమేష్ బాబు,ఎంపీడీవో కార్యాలయంలో రాధిక,పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకన్న, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ సమ్మేట రాము గౌడ్, గ్రామ పంచాయతీలో సర్పంచ్ పెద్దమాముల యాకయ్య, మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం రాములు నాయక్,రైతు వేదిక కార్యాలయంలో ఏఓ వినయ్ కుమార్,మండల విద్యా వనరుల కార్యాలయంలో విద్యాధికారి రామ్మోహన్ రావు,ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ లు జెండాను ఎగరవేశారు.తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.ఈ వేడుకల్లో అంబేద్కర్ యువజన సంఘాలు,అంగన్వాడి టీచర్లు,ఆశా వర్కర్లు,గ్రామైక్య సంఘాలు,కెవిపిఎస్ నాయకులు పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
