Telangana | జ‌గిత్యాల ఆస్ప‌త్రిలో చికిత్స

Telangana | జ‌గిత్యాల ఆస్ప‌త్రిలో చికిత్స

యూట్యూబ‌ర్ హ‌త్య కేసు నిందితుడికి అనారోగ్యం

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : యూట్యాబ‌ర్ వైష్ట‌వి హ‌త్య కేసులో నిందితుడు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న హ‌రిబాబు అనారోగ్యానికి గురిఇకావ‌డంతో జ‌గిత్యాల ఆస్ప‌త్రికి త‌ర‌లించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. యూ ట్యూబర్ వైష్ణవి హత్య కేసులో జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె భర్త హరిబాబు అస్వస్థతకు లోనయ్యాడు. ఇటీవలే కోరుట్లలో భార్యను హత్య చేసిన కేసులో హరిబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు జైల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతనిని జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం అత్యవసరంగా జగిత్యాల క్రిటికల్ కేర్ ఆస్పత్రికి తరలించారు. హరిబాబు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply