వెలికట్టను గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి..

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : గంజాయి రహిత గ్రామంగా మార్చాలని సి ఐ గణేశ్ వెల్లడించారు. ఆదివారం మండలం లోని వెలికట్ట గ్రామంలో సీఐ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను ఉంచాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న వివిధ రుగ్మతలు రూపు మాపాలంటే ప్రజలందరి సహకారం కావాలన్నారు.

అలాగే సైబర్ నేరాల మీద రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కల్పిస్తూ గ్రామంలోని ద్విచక్ర వాహనము గల ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలని ,గ్రామంలో సీ.సీ కెమెరాలు ,ఏర్పాటు చేసుకోవాలని ఇందుకు గ్రామసభ ఏర్పాటు చేసుకొని తీర్మానం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ,వార్డ్ మెంబర్లతో పాటు పోలీస్ సిబ్బంది రెండవ ఎస్సై అంజమ్మ ఎస్సై పదిమంది సిబ్బంది పాల్గొన్నారు.