ఖానాపూర్‌కు మరో అభివృద్ధి అడుగు..

  • హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కృషితో ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్,కడెం,ఖానాపూర్ మండలాల్లో నూతన తహసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికృషిచేస్తున్నారని, ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ,ఖానాపూర్ నియోజకవర్గం అబివృద్ధి చెందుతుంది అన్నారు.

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కృషితో నూతన తాహసిల్దార్ కార్యాలయ భవనాలు మంజూరు కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఆయా మండలాల్లోని తాసిల్దార్ కార్యాలయాలు ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించి అసౌకర్యాల మధ్య రెవెన్యూ అధికారులు ఉద్యోగులు కార్యాలను వచ్చే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నూతన తాసిల్దార్ కార్యాలయం భవనాలు నిర్మాణం పూర్తయితే అధికారులతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.