VSP Road Accident | విశాఖ–తుని రహదారిపై విషాదం

VSP Road Accident | విశాఖ–తుని రహదారిపై విషాదం

VSP Road Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఐషర్ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఢీకొట్టిన తీవ్రతకు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ గాల్లోకి ఎగిరి ఐషర్ వ్యాన్‌పై పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదుపు తప్పిన వ్యాన్ అదే మార్గంలో వెళ్తున్న ట్రాలీని కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన గాయత్రిగా పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.