jagadish reddy | నల్గొండ అభివృద్ధిపై జగదీశ్‌రెడ్డి ఫైర్
jagadish reddy | నల్గొండ అభివృద్ధిపై జగదీశ్‌రెడ్డి ఫైర్
‘జిల్లా అభివృద్ధి అంతా మాదే’
jagadish reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నల్గొండ జిల్లాలో కనిపిస్తున్న అభివృద్ధి అంతా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినదేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులే ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు.
అలాగే కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదని ఆరోపించిన జగదీశ్‌రెడ్డి, పీసీసీ అధ్యక్ష పదవి కొనుగోలు చేశారన్న ఆరోపణలు నిజం కాదా అని ప్రశ్నించారు. పలువురు సీనియర్ నేతలను పక్కనబెట్టి ఆ పదవిని దక్కించుకున్నారని, ప్రస్తుతం దోపిడీ, వసూళ్లతోనే ఆ పదవిని నిలబెట్టుకుంటున్నారని ఆరోపించారు.
