18 Days | వేటాడి చంపిన నిందితులకు రిమాండ్..

18 Days | వేటాడి చంపిన నిందితులకు రిమాండ్..

18 Days | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని మూర్రిట జెండాగూడ(Murrita Jendaguda), భీం గూడ గ్రామాలకు చెందిన ఆరుగురు ఈ నెల 16న రాత్రి అడవిలో నీలుగాయి జంతువును వేటాడి చంపినారని బిర్సాయిపేట్ రేంజ్ ఎఫ్ఆర్ఓ అరుణ(Range FRO Aruna) తెలిపారు. సమాచారం మేరకు ఆ గ్రామాలకు వెళ్లి తనిఖీలు చేయగా పచ్చి మాంసంతో పాటు వండిన మాంసం లభ్యమైందని ఆమె తెలిపారు.

ఆ గ్రామాల్లో వెళ్లి జంతువును వేటాడి చంపిన సీడం సోము, మడవి బాపురావు, ఆత్రం యాదవరావు, ఆత్రం రాములుతోపాటు మరో ఇద్దరు పరార్ లో ఉన్నారని ఎఫ్ఆర్ఓ తెలిపారు. నలుగురు నిందితులను ఈ రోజు ఉట్నూర్ కోర్టుకు(Court) హాజరుపరచగా ఉట్నూర్ కోర్టు న్యాయమూర్తి నిందితులకు 18 రోజుల రిమాండ్(remanded for 18 days) విధించించారని ఎఫ్ఆర్ఓ తెలిపారు. ఆ గ్రామాల్లో సోదాలు నిర్వహించి నిందితులను పట్టుకున్న వారిలో ఎఫ్ ఆర్ ఓ అరుణ తోపాటు ఎఫ్ ఎస్ ఓ లచ్చన్న, ఎఫ్ బి వో లు విట్టల్, సందీప్, అజయ్, మహిపాల్, బలవంత్ పాల్గొన్నారని బీర్సాయిపేట్ ఎఫ్ఆర్ఓ తెలిపారు.