శివచరణ్ రెడ్డిని సన్మానించిన శ్రీకాంత్ గౌడ్..

శివచరణ్ రెడ్డిని సన్మానించిన శ్రీకాంత్ గౌడ్..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఇండియన్ యూత్ కాంగ్రెస్ యాప్ కమిటీ మెంబర్ తొర్పునూరి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు సోమవారం శివ చరణ్ రెడ్డిని హైదరాబాదులోని వారి నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి శాలువా కప్పి సన్మానించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. మీ నాయకత్వంలో యువజన కాంగ్రెస్ మరింత బలపడుతూ, ప్రజాసేవలో ముందంజలో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ బలోపేతం కోసం మీరు చేసిన కృషి అభినందనీయం. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చి, వారికి ప్రోత్సాహం అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. శివచరణ్ రెడ్డికి ఆయురారోగ్యాలు, ఆనందం, విజయాలు చేకూరాలని కోరుకుంటున్నట్లుగా శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.