స్కూల్ బస్సు వెళుతుంటే..

స్కూల్ బస్సు వెళుతుంటే..
నల్లగొండ రూరల్, ఆంధ్ర ప్రభ : ప్రవేట్ స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నల్లగొండ మండలం చందనపల్లిలో
సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థులు ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న సందర్భంలో నార్కెట్ పల్లి మండలం నక్కలపల్లికి చెందిన ఇద్దరు బావ బామ్మర్ది బైక్ పై నకిరేకల్ వైపు వెళ్తున్నారు. అయితే.. చందనపల్లి వద్దకు
రాగానే ఎదురుగా వచ్చిన స్కూల్ బస్సు, బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

