మోహన్ రెడ్డికి పదవి లభించడం హర్షణీయం..
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పిఎసిఎస్ నూతన డైరెక్టర్ గా ఎన్నికైన సీనియర్ నేత మోర్తల మోహన్ రెడ్డి ని కాంగ్రెస్ నాయకులు శనివారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా ఆలేరులో కాంగ్రెస్ నాయకునిగా, వార్డు మెంబర్ గా మోహన్ రెడ్డి అందించిన సేవలు అమూల్యమైన అని చెప్పారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మోహన్ రెడ్డి కాంగ్రెస్ విజయంలో కీలకంగా పనిచేశారని వారు తెలిపారు. పిఎసిఎస్ డైరెక్టర్ పదవినివ్వడం ద్వారా మోహన్ రెడ్డికి గౌరవం దక్కిందని వారు అభిప్రాయపడ్డారు. కౌన్సిలర్ జెట్ట నీరజాసిద్ధులు, పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు చిన్నం యాదగిరి, సీనియర్ నాయకులు ఎగ్గిడి రవి తదితరులు పాల్గొన్నారు.
