Tekumatla | రోడ్డు భద్రత నియమాలపై వ్యాసరచన పోటీలు
Tekumatla | రోడ్డు భద్రత నియమాలపై వ్యాసరచన పోటీలు
Tekumatla | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శనివారం ‘ అరైవ్- అలైవ్ ‘లో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టేకుమట్ల ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించడం, జీబ్రా క్రాసింగ్ నియమాలను ఫాలో అవ్వడం, అధిక వేగంతో దూసుకెల్లడం లాంటివి చేయవద్దని తెలిపారు. అనంతరం విద్యార్థులకు భద్రత నియమాలపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు.
