TG | నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక ఆంధ్రప్రభ

TG | నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక ఆంధ్రప్రభ
- ఆంధ్రప్రభ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
TG | ఆంధ్రప్రభ, చౌటుప్పల్ : నూతన వరవడితో అందరి అభిమానాన్ని చూరగొంటున్న ” పత్రిక ఆంధ్రప్రభ ” దినపత్రిక అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలానికి శనివారం వచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి “ఆంధ్రప్రభ” 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను చైతన్య వంతం చేసిన పత్రిక, నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక “ఆంధ్రప్రభ” అన్నారు. గత 88 సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ అందరి అభిమానాన్ని పొందుతుందన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన హంగులతో రోజు రోజుకు ఆంధ్రప్రభ దినపత్రిక పాఠకులకు చేరువవుతుందని, ప్రజలను చైతన్య వంతులుగా చేయడంలో ఆంధ్రప్రభ కు ప్రత్యేక స్థానముందన్నారు. వాస్తవాలను ఎప్పటికప్పుడు నిర్భయంగా ప్రజల ముందు ఉంచడం అభినందనీయమన్నారు. పాఠకుల ఆలోచనలకు అనుగుణంగా “ఆంధ్రప్రభ” దినపత్రిక, వెబ్, స్మాట్, యూట్యూబ్ ఛానల్స్ ద్వార ప్రజల ముందుకు రావడం హర్షనీయమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ చౌటుప్పల్ డివిజన్ స్టాఫర్, నియోజకవర్గం ఇన్చార్జి దోనూరు రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, చౌటుప్పల్ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, ఫిషరీస్ జిల్లా చైర్మన్ పాశం సంజయ్ బాబు, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, సర్పంచులు భీమిడి ప్రదీప్ జీ, గంగాపురం వసంత నగేష్ గౌడ్, తీగుళ్ల చంద్రయ్య, గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్, గంజి వనజా కృష్ణ, రిక్కల మహేందర్ రెడ్డి, ముస్కు అంజిరెడ్డి, మాజీ సర్పంచులు గుండు మల్లయ్య గౌడ్, చింతపల్లి వెంకట్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్, నాయకులు ఉప్పు భద్రయ్య, కొయ్యడ సైదులు, మొగుదాల రమేష్, బత్తుల విప్లవ్, కంచరకుంట్ల రామ్ రెడ్డి, దుబ్బాక ఆకాష్ రెడ్డి, ఊడుగు శ్రీనివాస్, ఊడుగు రమేష్, పస్తం గంగారాములు తదితరులు పాల్గొన్నారు.
