Tejas Shirse breaks National Record | జాతీయ రికార్డు బద్దలు..

Tejas Shirse breaks National Record | జాతీయ రికార్డు బద్దలు..

  • 110 మీటర్ల హర్డిల్స్‌లో కొత్త చరిత్ర
  • కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించిన భారత అథ్లెట్
  • తేజస్‌కు కామన్వెల్త్ బెర్త్
  • తన రికార్డునే తానే చెరిపేసిన తేజస్ శిర్సే

ఆంధ్రప్రభ : భారత అథ్లెటిక్స్‌లో మరో రికార్డ్ నమోదైంది. భారత స్టార్ హర్డిలర్ తేజస్ శిర్సే (Tejas Shirse breaks National Record) పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు. పంజాబ్‌లోని లూథియానాలో ఉన్న గురునానక్ స్టేడియంలో శనివారం జరిగిన ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్-9 పోటీల్లో తేజస్ శిర్సే 13.27 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. దీంతో 2024లో తానే నెలకొల్పిన 13.41 సెకన్ల జాతీయ రికార్డును 0.14 సెకన్ల తేడాతో మెరుగుపరిచాడు.

Tejas Shirse breaks National Record

ఆసియాలో టాప్-6 ప్రదర్శన

ఈ ప్రదర్శనతో తేజస్ శిర్సే ఈ సీజన్‌లో ఆసియా అథ్లెట్లలో ఆరో అత్యుత్తమ టైమ్ నమోదు చేసిన అథ్లెట్‌గా నిలిచాడు. 24 ఏళ్ల ఈ యువ అథ్లెట్ నిలకడగా రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ఆశాకిరణంగా మారుతున్నాడు. ఈ రికార్డు ప్రదర్శనతో తేజస్ శిర్సే ఈ ఏడాది జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించాడు. ఇప్పటికే గత నెల చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్-6లో స్వర్ణ పతకం సాధించి ఆసియా క్రీడలకు కూడా తన స్థానం ఖాయం చేసుకున్నాడు.

భారత అథ్లెటిక్స్‌కు శుభసూచకం

వరుసగా రికార్డులు బద్దలు కొడుతూ అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేస్తున్న తేజస్ శిర్సే ప్రదర్శన భారత అథ్లెటిక్స్‌కు శుభసూచకంగా భావిస్తున్నారు నిర్వ‌హకులు. దీంతో రాబోయే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tejas Shirse breaks National Record

New Zealand | కేన్ విలియమ్సన్‌కు రీప్లేస్‌మెంట్ ఖరారు..

INDvsADG-ODI | 6:00 దాటితే మ్యాచ్ రద్దే.. అభిమానుల్లో టెన్షన్ !!


Leave a Reply