అమ్మవారి నిత్య అన్నదానానికి రూ.2.01 లక్షల విరాళాలు

అమ్మవారి నిత్య అన్నదానానికి రూ.2.01 లక్షల విరాళాలు

భక్తిశ్రద్ధలతో విరాళాలు అందజేసిన ఇద్దరు దాతలు

ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి భక్తులు ఉదారంగా విరాళాలు సమర్పించారు. శనివారం ఇద్దరు దాతల కుటుంబాలు కలిపి రూ.2,01,232లను దేవస్థానానికి అందజేశాయి. కడప జిల్లా చిన్నచౌక్‌కు చెందిన కే. గోపిరెడ్డి కుటుంబ సభ్యులు అయ్య వరమ్మ పేరున రూ.1,00,116లను నిత్య అన్నదాన విభాగానికి విరాళంగా సమర్పించారు.

అలాగే విజయవాడ రామవరప్పాడుకు చెందిన వై. కనకదుర్గ, కుటుంబ సభ్యులు రూ.1,01,116లను విరాళంగా అందజేశారు. దాతలు అమ్మవారిపై భక్తిశ్రద్ధలతో ఈ విరాళాలను సమర్పించగా, దేవస్థాన అధికారులు ఆలయ ముఖ్య అర్చకుల సమక్షంలో విరాళాలను స్వీకరించారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయగా పూజలు అనంతరం ఆశీర్వచనాలు అందజేసి, ప్రత్యేక ప్రసాదాలను అందించారు.

Leave a Reply